Government Degree College Ravulapalem
College Image

Telugu Department

 

అభ్యసన ఫలితాలు :-

 

 

 

 

 

SEM - 1

 

 

 

 

 

 

అభ్యసన ఫలితాలు :-

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

SEM-2

               

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

SEM-3

 

 

 

 

SEM - 3

 

అభ్యసన ఫలితాలు :-

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

1.ప్రాచీన తెలుగు సాహిత్యం యొక్క ప్రాచీనతను,విశిష్టతను గుర్తిస్తారు . తెలుగు సాహిత్యంలో

ఆదికవి నన్నయ కాలం నాటి భాషా సంస్కృతులను , ఇతిహాస కాలం నాటి రాజనీతి విషయాలపట్ల పరిజ్ఞానాన్ని సంపాదించగలరు .

2 . à°¶à°¿à°µ కవుల  కాలం నాటి మత పరిస్థితులను , భాషా విశేషాలను గ్రహిస్తారు . తెలుగు నుడికారం ,సామెతలు , లోకోక్తులు మొదలైన భాషాంశాల పట్ల పరిజ్ఞానాన్ని పొందగలరు .

3 . తిక్కన భరతం నాటి మత, ధార్మిక పరిస్థితులను , తిక్కన కవితా శిల్పాన్ని , నాటకీయతను అవగాహన చేసుకోగలరు .

4 . ఎఱ్ఱన సూక్తి వైచిత్రిని , ఇతిహాస కవిత్వంలోని విభిన్న రీతులపట్ల అభిరుచిని పొందగలరు . శ్రీనాథుని కాలం నాటి కవితా విశేషాలను , మొల్ల కవితా విశిష్టతను గుర్తించగలరు .

5 . తెలుగు పద్యం స్వరూప స్వభావాలను , సాహిత్య అభిరుచిని పెంపొందించుకుంటారు .

ప్రాచీన కావ్య భాషలోని వ్యాకరణాంశాలను అధ్యయనం చేయడం ద్వారా భాషా సామర్ధ్యాన్ని

రచనల మెళుకువలను గ్రహించగలరు .

 

1 . ఆంగ్లభాష ప్రభావం కారణంగా తెలుగులో వచ్చిన ఆధునిక సాహిత్యాన్ని , దాని విశిష్టతను గుర్తిస్తారు .

2 . సమకాలీన ఆధునిక సాహిత్య ప్రక్రియలైన "వచిన కవిత్వం ,కథ ,నవల ,నాటకం , విమర్శ"

లపై అవగాహన పొందుతారు .

3 . భావకవిత ,అభ్యుదయ కవితాలక్ష్యాలను గూర్చిన జ్ఞానాన్ని పొందుతారు . అస్తిత్వవాద ఉద్యమాల పుట్టుకను , ఆవశ్యకతను గుర్తిస్తారు .

4 . కథాసాహిత్యం ద్వారా సామాజిక చైతన్యాన్ని పొందుతారు .సిద్ధాంతాల ద్వారా కాకుండా , వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడం ద్వారా సిద్ధాంతాన్ని సమీక్షించగలరు .

5 . ఆధునిక తెలుగు కల్పనాసాహిత్యం ద్వారా సామాజిక , సాంస్కృతిక , రాజకీయ చైతన్యాన్ని

పొందుతారు..

 

 

 

 

 

 

 

 

 

1.తెలుగు సాహిత్య అభ్యసన ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను , సృజనాత్మక నైపుణ్యాలుగా

మార్చుకోగలరు .

2 . విద్యార్థులు భాషాతత్వాన్ని , భాష యొక్క ఆవశ్యకతను , భాష యొక్క ప్రాధాన్యాన్ని గుర్తిస్తారు . మనిషి వ్యక్తిగత జీవనానికి , సామాజిక వ్యవస్థ పటిష్ఠతకు భాష ప్రధానమని తెలుసుకుంటారు. తెలుగు భాషలోని కీలకాంశాలైన "వర్ణం పదం వాక్యం "ల ప్రాధాన్యాన్ని గుర్తిస్తూ , వాగ్రూప లిఖితరూప వ్యక్తీకరణ ద్వారా భాషానైపుణ్యాలను మెరుగు పరుచుకోగలరు .

3 . భాషానైపుణ్యాలను అలవర్చుకోవడంతోపాటు వినియోగించడం నేర్చుకుంటారు . రచనా, భాషానైపుణ్యాలను సృజనాత్మక రూపంలో వ్యక్తీకరించగలరు .

4 . ప్రాచీన పద్యరచనతో పాటు ఆధునిక కవిత ,కథ,వ్యాసం ,మొదలైన సాహిత్య ప్రక్రియల

నిర్మాణాలకు సంబంధించిన సిద్ధాంతవిషయాలను నేర్పడంతో పాటు వారిలో రచనా నైపుణ్యాలను పెంపొందించుకోగలరు .5 . సృజన రంగం , ప్రసార మాధ్యమ రంగాల్లో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోగలరు .

6 . అనువాద రంగంలో నైపుణ్యం సంపాదించగలరు .